ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అభివృద్ధికి తెదేపా ఎప్పుడూ వ్యతిరేకం కాదు: కూన రవికుమార్ - కూన రవికుమార్ వార్తలు

స్పీకర్ తమ్మినేని సీతారాంపై తెదేపా నేత కూన రవికుమార్ మండిపడ్డారు. ఆయనకు మంత్రి పదవి దక్కలేదన్న కారణంతో 2 నెలల పాటు ఇంటి గడప కూడా దాటలేదని ఆరోపించారు. అభివృద్ధికి తెదేపా ఎప్పుడూ వ్యతిరేకం కాదన్నారు.

tdp leader kuna ravikumar fires on speaker tammineni
స్పీకర్​పై మండిపడ్డ తెదేపా నేత కూన రవికుమార్

By

Published : Sep 7, 2020, 10:58 PM IST

స్పీకర్​పై మండిపడ్డ తెదేపా నేత కూన రవికుమార్
స్పీకర్​పై మండిపడ్డ తెదేపా నేత కూన రవికుమార్

స్పీకర్ తమ్మినేని సీతారామ్​కు మంత్రి పదవి దక్కలేదన్న కారణంతో 2 నెలలపాటు ఇంటి గడప కూడా దాటలేదని తెదేపా నేత కూన రవి కుమార్ ఆరోపించారు. అభివృద్ధికి తెదేపా ఎప్పుడూ వ్యతిరేకం కాదన్నారు. అనపర్తిలో వైకాపా నాయకులే కోర్టులకు వెళ్లారని ఆరోపించారు.

దశాబ్దాల పాటు సాగులో ఉన్న భూములను లాక్కోవడంతో బాధితులు కోర్టులను ఆశ్రయించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్ హోదాలో ఉంటూ.. ప్రతిదానిని తెదేపాకు ఆపాదించడం సరికాదని హితవు పలికారు. దమ్ముంటే తెదేపా ప్రమేయం ఎక్కడుందో వాస్తవాలను బయటపెట్టాలని సవాల్ విసిరారు.

ABOUT THE AUTHOR

...view details