ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్నికల్లో కార్యకర్తల పోరాటం మర్చిపోలేనిది: కొల్లు రవీంద్ర - కొల్లు రవీంద్ర తాజా వార్తలు

మచిలీపట్నం మున్సిపల్ ఎన్నికల్లో కార్యకర్తలు చేసిన పోరాటం మరిచిపోలేనిదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర అన్నారు. విజయం సాధించిన వారిని ఆయన అభినందించారు.

మాట్లాడుతున్న కొల్లు రవీంద్ర
మాట్లాడుతున్న కొల్లు రవీంద్ర

By

Published : Mar 15, 2021, 12:28 PM IST

కృష్ణా జిల్లా మచిలీపట్నం మున్సిపల్ ఎన్నికల్లో తమ కార్యకర్తలు చేసిన పోరాటం మరచిపోలేనిదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర అన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు అనేది సహజమన్న ఆయన... తెలుగుదేశం పార్టీ అనేక ఆటుపోట్లను ఎదుర్కొందని గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ చేసిన అరాచకాలు, బెదిరింపులకు ప్రజలు ఆందోళన చెందారని చెప్పారు.

తమకు ఓటు వేయకపోతే ప్రభుత్వ పథకాలు నిలిపివేస్తామని అధికార పార్టీ నేతలు ఓటర్లను బ్లాక్ మెయిల్ చేశారని... వాలంటీర్లను వినియోగించుకుని ప్రజలపై ఒత్తిడి తీసుకువచ్చారని ఆరోపించారు. ఎన్నికల్లో విజయం సాధించిన నాయకులకు కొల్లు రవీంద్ర అభినందనలు తెలిపారు. ఓటమి వచ్చిందని నిరాశపడకుండా.. రెట్టింపు ఉత్సహంతో ముందుకు వెళ్లాలని రవీంద్ర పిలుపినిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details