మంత్రి పేర్ని నానిపై.. తెదేపా నేత కొల్లు రవీంద్ర తీవ్ర ఆరోపణలు చేశారు. స్థానిక ఎన్నికల్లో అడ్డదారుల్లో విజయాలు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. వైకాపా మద్దతుదారుల విజయాల కోసం పేర్ని నాని బెదిరింపులు, ప్రలోభాలకు పాల్పడుతున్నారన్నారు. బందరు మండల పరిధిలోని భోగిరెడ్డిపల్లిలోని.. తెదేపా మద్దతుదారుని నామినేషన్‌ని.. మంత్రి ఒత్తిడితోనే సరైన కారణం లేకుండా తిరస్కరించారన్నారు. ఈ విషయంపై ఆర్డీవో కార్యాలయానికి వెళ్లిన కొల్లు రవీంద్ర... ఇక్కడ న్యాయం జరగకపోతే, ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్తామని స్పష్టం చేశారు.
'మంత్రి పేర్ని నాని... బెదిరింపులకు పాల్పడుతున్నారు' - కొల్లు రవీంద్ర అప్డేట్
మంత్రి పేర్ని నానిపై.. తెదేపా నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. స్థానిక ఎన్నికల్లో గెలుపుకోసం అడ్డదారులు తొక్కుతున్నారని ఆరోపించారు.
మాజీ మంత్రి కొల్లు రవీంద్ర