ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా విధ్వంసానికి ఏడాది పూర్తి: కళా వెంకట్రావు - ప్రభుత్వంపై కళా వెంకట్రావు మండిపాటు

వైకాపా విధ్వంసానికి సంవత్సర కాలం పూర్తయిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు విమర్శించారు. తెదేపా నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయటాన్ని ఆయన ఖండించారు.

tdp leader kala venkatrao fires on government
ప్రభుత్వంపై తెదేపా నేత కళా వెంకట్రావు మండిపాటు

By

Published : Jun 25, 2020, 12:03 PM IST

వైకాపా విధ్వంసానికి ఏడాది పూర్తయిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు విమర్శించారు. ప్రజావేదిక కూల్చి రూ.9కోట్ల ప్రజాధనాన్ని మట్టిపాలు చేశారని ఆరోపించారు. తెదేపా నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయటాన్ని ఆయన ఖండించారు. శుభకార్యంతో పాలన ప్రారంభించకుండా ప్రజావేదిక కూల్చివేతతో జగన్ పాలన ప్రారంభించారని విమర్శించారు.

నెల్లూరు జిల్లా కావలిలో ఉపరాష్ట్రపతి ప్రారంభించిన శిలాఫలకాన్ని కూల్చివేశారని మండిపడ్డారు. విజయవాడలో అవతార్ పార్క్​ను ధ్వంసం చేశారని, అనంతపురం జిల్లా పేరూరులో చంద్రబాబు శిలాఫలకం ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు, మడకశిర, మాచర్లల్లో పేదల ఇళ్లను, నర్సారావుపేటలో అన్న క్యాంటీన్లను కూల్చివేశారని మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details