ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సీఎం సలహాదారులు రాజకీయ దుష్ప్రచారం చేయటం దుర్మార్గం' - కళా వెంకట్రావు

ముఖ్యమంత్రి సలహాదారులపై తెదేపా నేత కళా వెంకట్రావు మండిపడ్డారు. వారు.. రాజకీయ దుష్ప్రచారం చేయడం తగదని హితవు పలికారు.

TDP leader kala venkatrao Fire on cm Advisery members
ముఖ్యమంత్రి సలహాదారునిపై ళా వెంకట్రావు ఆగ్రహం

By

Published : Jun 27, 2020, 10:11 PM IST

ముఖ్యమంత్రి సలహాదారులు రాజకీయ దుష్ప్రచారం చేయటం దుర్మార్గమని తెదేపా నేత కళా వెంకట్రావు అన్నారు. అజయ్ కల్లాంరెడ్డి రాజకీయ విమర్శలు చేయటం అధికార దుర్వినియోగమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.4.80కు వచ్చే విద్యుత్​ను కాదని రూ.11తో కొనుగోలు చేయడం ఆదా చేయడం అవుతుందా అని ప్రశ్నించారు.

హైకోర్టు తీర్పులు అమలు చేయకుండా పీపీఏలను ఉల్లంఘించింది జగన్ ప్రభుత్వం కాదా అని కళా వెంకట్రావు నిలదీశారు. తమ అవినీతిని కప్పిపుచ్చుకోవటం కోసం తెదేపాపై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ABOUT THE AUTHOR

...view details