ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వైకాపా పాలనలో ఉన్నత పదవులన్నీ ఆ సామాజిక వర్గానికే' - ks jawahar criticizing ycp government

ఒక సామాజిక వర్గానికి వైకాపా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెదేపా నేత, మాజీ మంత్రి జవహర్ విమర్శించారు. ఉన్నత పదవులు, పదోన్నతులు వారికే కట్టబెడుతున్నారని ఆరోపించారు.

tdp leader jawahar
tdp leader jawahar

By

Published : Aug 28, 2020, 10:58 PM IST

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉన్నత పదవులు, పదోన్నతులు ఒక సామాజిక వర్గానికే ఎక్కువగా దక్కాయని మాజీ మంత్రి, తెదేపా నేత జవహర్ అన్నారు. సీఎం జగన్​కు మిగతా సామాజిక వర్గాల్లో సమర్థులు కనబడడం లేదా అని ఆయన ప్రశ్నించారు. అలాగే వైకాపా ఇన్​ఛార్జ్​లుగా ఉన్న వారందరూ ఒకే సామాజికవర్గానికి చెందిన వారని జవహర్ తెలిపారు. వీటన్నింటినీ మరిచిపోయి చంద్రబాబుపై విజయసాయిరెడ్డి విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

ABOUT THE AUTHOR

...view details