జలవివాదాలపై సన్నాయి నొక్కులు ఆపి సమస్యపై దృష్టి పెట్టాలని మాజీమంత్రి జవహర్ హితవు పలికారు. ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు మాదిరి డ్రామాలాపాలని మంత్రులను ఎద్దేవా చేశారు. మంత్రి వర్గ సబ్ కమిటీని తెలంగాణకు పంపి.. వారి ప్రయత్నాలను నిలువరించాలన్నారు. నదీ జలాలు సముద్రం పాలుకాకుండా కాపాడాలన్నారు. తెలంగాణలోని ఆంధ్ర ప్రజల గురించి ఆలోచించే జగన్.. ఇక్కడి ఆంధ్రులపై వేధింపులపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు
WATER WAR: 'సన్నాయి నొక్కులు ఆపండి.. సమస్యపై దృష్టి పెట్టండి' - మాజీమంత్రి జవహర్ హితవు
తెలుగు రాష్ట్రాలలో జలవివాదాలు రోజుకో విధంగా మారుతున్నాయి. జలవివాదాలపై సన్నాయి నొక్కులు ఆపి సమస్యపై దృష్టి పెట్టాలని మాజీమంత్రి జవహర్ హితవు పలికారు. నదీ జలాలు సముద్రం పాలుకాకుండా కాపాడాలన్నారు
మాజీమంత్రి జవహర్