మంత్రి పేర్ని నానిపై మాజీ మంత్రి జవహర్ విమర్శనాస్త్రాలు సంధించారు. బందరులో పద్మజ అనే ఎస్సీ మహిళను హత్య చేశారని అన్నారు. అనుచరుడు హత్యచేసి పట్టుబడితే పేర్ని నాని ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు. మంత్రులు ప్రజలతో ఉండాలిగానీ రౌడీషీటర్లు, నేరస్థులతో పనేంటి? అని మండిపడ్డారు.
16 నెలల కాలంలో ఎస్సీలపై దాడులు జరగని రోజు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా పాలనలో న్యాయం ఖరీదైన వస్తువుగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. తక్షణమే మంత్రి పేర్ని నాని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.