పేద కుటుంబాలను ఆదుకోవాలంటూ తెదేపా నేత గద్దె రామ్మోహన్ నిరసన దీక్షకు దిగారు. లాక్‌డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు రూ.5 వేలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడలోని తన నివాసంలోనే కుటుంబసభ్యులతో కలిసి నిరసన దీక్షకు చేపట్టారు. అన్న క్యాంటీన్లు తెరవాలని, చంద్రన్న బీమాను పునరుద్ధరించాలని 12 గంటల దీక్ష చేపట్టారు.
పేదలను ఆదుకోవాలంటూ గద్దె రామ్మోహన్ దీక్ష - తెదేపా నేత గద్దె రామ్మోహన్
లాక్‌డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు రూ.5 వేలు ఇవ్వాలని తెదేపా నేత గద్దె రామ్మోహన్ తన నివాసంలో కుటుంబసభ్యులతో కలిసి నిరసన దీక్ష చేపట్టారు. రామ్మోహన్ చేపట్టిన 12 గంటల దీక్షకు ఎంపీ కేశినేని, దేవినేని ఉమ, అశోక్‌బాబు, బుద్దా వెంకన్న మద్దతు పలికారు.
పేదలను ఆదుకోవాలంటూ గద్దె రామ్మోహన్ దీక్ష
గద్దె రామ్మోహన్ దీక్షకు ఎంపీ కేశినేని, దేవినేని ఉమ, అశోక్‌బాబు, బుద్దా వెంకన్న మద్దతు పలికారు. కరోనా నియంత్రణ చర్యల్లో ప్రతిపక్షాల సలహాలు తీసుకోవాలని ఎంపీ కేశినేని సూచించారు. గద్దె దంపతులకు మద్దతుగా తెదేపా నేతలు వారివారి ఇళ్లలో దీక్ష చేస్తారని కేశినేని నాని వెల్లడించారు.
TAGGED:
తెదేపా నేత గద్దె రామ్మోహన్