రాష్ట్రంలో మహిళలపై వరుస అఘాయిత్యాలు జరుగుతుంటే ముఖ్యమంత్రి ఎందుకు స్పందించట్లేదని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత నిలదీశారు. పులివెందులలో మహిళ హత్య ఘటన మరవకముందే అనంతపురం జిల్లా ధర్మవరంలో మరో ఎస్సీ మహిళ స్నేహలతను చంపి దహనం చేసేందుకు యత్నించారని ధ్వజమెత్తారు.
జంతువులను కోసినంత సులభంగా ఆడబిడ్డల గొంతు కోసి కాల్చడం ఈ ప్రభుత్వ పాలనలో జరుగుతోందని మండిపడ్డారు. ఇంకా ఎంత మంది తల్లిదంద్రుడుల గర్భశోకాన్ని చూస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సైకో ముఖ్యమంత్రికి ఉన్నవారంతా భజన మంత్రులేనని దుయ్యబట్టారు. వైకాపాకు చెందిన 151మంది ఎమ్మెల్యేల ఇళ్లలో ఈతరహా ఘటనలు జరిగితే ఇలాగే స్పందిస్తారా అని నిలదీశారు.