ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సీఎం జగన్​కు రంగుల పిచ్చి పట్టుకుంది' - tdp leader divyavani latest news

వైకాపా ప్రభుత్వ వైఖరిపై తెదేపా అధికార ప్రతినిధి దివ్యవాణి మండిపడ్డారు. పోలీసు వాహనాలకు కూడా పార్టీ రంగులు వేయటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. పద్ధతి మార్చుకోకుంటే ప్రజలే వైకాపాకు రంగు పూస్తారని హెచ్చరించారు.

tdp
దివ్యవాణి

By

Published : Dec 21, 2020, 10:58 PM IST

వైకాపా రంగులు వేసి గుంటూరు పోలీసులకు పంపిణీ చేసిన వాహనాలు ప్రభుత్వానివా? లేక పులివెందులలో పంచాయితీ చేసి తీసుకొచ్చారా? అని తెదేపా అధికార ప్రతినిధి దివ్యవాణి నిలదీశారు. పోలీసు వాహనాలకు కూడా పార్టీ రంగులు వేయటం ఎంతవరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. తక్షణమే వేసిన రంగులను తొలగించి చట్టాన్ని గౌరవించాలని డీజీపీని కోరారు.

పాలన చేతకాని ముఖ్యమంత్రి జగన్​కు రంగుల పిచ్చి పట్టుకుందని ఎద్దేవా చేశారు. దురాగతాలను మార్చుకోకుంటే ప్రజలే వైకాపాకు రంగు పూస్తారని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details