మంత్రి కొడాలి నాని పనితీరు, మాటలు ప్రజలకు ఏమైనా ఉపయోగకరంగా ఉన్నాయా అని తెదేపా అధికార ప్రతినిధి దివ్యవాణి నిలదీశారు. చంద్రబాబు వయస్సు గురించి, చావుల గురించి మాట్లాడటానికి నాని ఏమైనా యమధర్మరాజుకి శిష్యుడా అని ఎద్దేవా చేశారు. లారీలతో గుద్దిస్తామనే ఆలోచనలు మంత్రిస్థాయిలో ఉండి చేయడం బాధాకరమన్నారు.
లక్ష కోట్ల అప్పులు తెచ్చి, ఏం చేశారో చెప్పకుండా.. ప్రశ్నించినవారిని చంపేస్తాం.. అని బెదిరిస్తారా అంటూ దివ్యవాణి మండిపడ్డారు. జగన్ ప్రజలసొమ్మును కోర్టు ఖర్చులకు దుబారా చేయకుండా, ఆ సొమ్ముతో తన పార్టీవారికి సభ్యత, సంస్కారాలు నేర్పితే మంచిదని హితవు పలికారు. మంత్రి పదవితో ఉండి నాని ఏం చేస్తున్నాడో, ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదని దివ్యవాణి విమర్శించారు.