లాక్డౌన్ సమయంలో సామాన్య ప్రజలపై వైకాపా ప్రభుత్వం లాఠీలు ఝుళిపిస్తోందని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. ప్రచారం కోసం బాధ్యత మరచి వ్యవహరిస్తున్న వైకాపా నేతల చర్యలపై ముఖ్యమంత్రి జగన్ ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. గుంపులు గుంపులుగా ట్రాక్టర్ ర్యాలీలు, పూలవర్షాలు, రిబ్బన్ కట్టింగ్లు చేస్తున్న పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ట్విట్టర్లో వైకాపా నేతల ప్రచార చిత్రాలను పోస్ట్ చేశారు.
'ముందు మీ పార్టీ నేతలపై చర్యలు తీసుకోండి' - devineni uma maheshwararao news today
రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మాజీమంత్రి, తెదేపా నేత దేవినేని మండిపడ్డారు. సామాన్య ప్రజలపై వైకాపా ప్రభుత్వం లాఠీలు ఝుళిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
వైకాపా పాలనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ మాజీ మంత్రి దేవినేని