Devineni Uma: రహదారుల దుస్థితిని నిరసిస్తూ.. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో మాజీ మంత్రి, తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు పాదయాత్ర చేపట్టారు. దుగ్గిరాలపాడులో మొదలైన ఈ యాత్ర సాయంత్రం జి.కొండూరులో ముగియనుంది. మొత్తం 14కిలోమీటర్ల మేర సాగనున్న యాత్రలో.. ప్రజల కష్టాలు తెలుసుకుంటూ ఆయన ముందుకు వెళ్తున్నారు. రోడ్లపై గుంతల వల్ల మైలవరం నియోజకవర్గంలోని 9 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
రోడ్ల దుస్థితిని చూసి ప్రభుత్వం కళ్లు తెరవాలి: దేవినేని ఉమా
Devineni Uma: వైకాపా పాలనలో రహదారుల దుస్థితిని నిరసిస్తూ.. మైలవరం నియోజకవర్గంలో.. తెదేపా నేత దేవినేని ఉమా పాదయాత్ర చేపట్టారు. రోడ్లపై గుంతల వల్ల మైలవరం నియోజకవర్గంలోని 9 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
రోడ్ల దుస్థితిని చూసి ప్రభుత్వం కళ్లు తెరవాలి: దేవినేని ఉమా
మూడేళ్లలో గుంతల్లో పడి ముగ్గురు చనిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా హయాంలో 25 వేల కిలోమీటర్ల రోడ్లు వేస్తే.. వైకాపా పాలనలో ఒక్క రోడ్డునూ బాగుచేసిన పాపాన పోలేదని ఆక్షేపించారు. అన్ని రంగాల్లో ప్రభుత్వం వైఫల్యం చెందిందని మండిపడ్డారు. రాష్ట్రంలో రోడ్ల దుస్థితిని చూసి.. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని ధ్వజమెత్తారు.
ఇవీ చూడండి: