ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సీబీఐ చిటికె వేస్తే వైకాపా పరిస్థితేంటి..?' - వైకాపాపై తెదేపా నేత దేవినేని విమర్శలు

వైకాపా నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. రాష్ట్రంలో ఇసుక కొరత తీవ్రంగా ఉందన్న ఆయన.. నిర్మాణ కార్మికుల తరఫున చంద్రబాబు చేసిన పోరాటాన్ని అమాత్యులు అపహాస్యం చేశారని మండిపడ్డారు. వైకాపా నేతలు భాష అభ్యంతరకరంగా ఉందని.. దానిని మార్చుకోవాలని హితవు పలికారు.

'సీబీఐ అధికారులు చిటికె వేస్తే వైకాపా పరిస్థితేంటి..?'

By

Published : Nov 17, 2019, 1:21 PM IST

Updated : Nov 17, 2019, 3:00 PM IST

వైకాపా మంత్రుల భాషపై తెదేపా నేత దేవినేని అభ్యంతరం

సీబీఐ అధికారులు చిటికె వేస్తే రాష్ట్రంలో వైకాపా పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.. తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు. విజయవాడలో పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. సీఎం జగన్మోహన్​రెడ్డి స్క్రిప్టునే రాష్ట్ర మంత్రులు చదువుతున్నారని ఎద్దేవా చేశారు. సన్నబియ్యం గురించి ప్రశ్నిస్తే అమాత్యులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. భవన కార్మికుల పక్షాన 70 ఏళ్ల వయసులో తమ పార్టీ అధినేత చంద్రబాబు దీక్ష చేస్తే అపహాస్యం చేస్తారా..? అంటూ ధ్వజమెత్తారు. తెదేపాకు అధికార, ప్రతిపక్షాలు కొత్తేమీ కాదని.. తమ పార్టీని స్టోర్​రూంలో పెట్టడం ఎవ్వరి వల్లా కాదని అన్నారు. వైకాపా నాయకులు భాషను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. మాతృభాషను కాపాడాలని మేధావులు సూచిస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

Last Updated : Nov 17, 2019, 3:00 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details