వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. తమ పార్టీ నేతల అరెస్టులను ఖండిస్తూ కృష్ణా జిల్లా మైలవరంలో కార్యకర్తలతో కలిసి ఆయన నిరసన చేపట్టారు. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపితే ప్రతిపక్ష నాయకులపై కక్ష సాధిస్తారా అని ప్రశ్నించారు. మరోవైపు పంచాయతీ ఎన్నికల విషయంలో హైకోర్టు తీర్పు జగన్ సర్కార్‌కి చెంపపెట్టులాంటిదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారని వ్యాఖ్యానించారు. కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు.
ఎన్నికలపై హైకోర్టు తీర్పు జగన్ సర్కార్‌కి చెంపపెట్టు: దేవినేని - కృష్ణా జిల్లాలో తెదేపా నిరసన
తెదేపా నేతల అరెస్టులను ఖండిస్తూ కృష్ణా జిల్లా మైలవరంలో కార్యకర్తలతో కలిసి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు నిరసన చేపట్టారు. ప్రతిపక్షనేతలపై వైకాపా సర్కార్ కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు.
తెదేపా నిరసన