ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతుల బాధలు సీఎంకు పట్టడం లేదు: దేవినేని ఉమా - కృష్టా జిల్లా తాజా వార్తలు

సీఎం జగన్​ రైతుల పట్ల, వారి సమస్యల పరిష్యారానికి ఎటువంచి ప్రాధాన్యం చూపకపోవడాన్ని మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన వాగ్దానాలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

pasupu chaitanyam by devineni uma
రైతుల బాధలు సీఎంకు పట్టడంలేదు

By

Published : Dec 23, 2020, 9:41 PM IST

రైతును పట్టించుకోని ముఖ్యమంత్రి పండక్కి ఇడుపులపాయ వెళ్లారని మాజీ మంత్రి దేవినేని ఉమా ధ్వజమెత్తారు. ఒక్క రైతును పలకరించ లేదు.. ఒక్క పత్తిచేను చూడలేదు.. ఒక్క మిర్చి చేను చూడలేదని మండిపడ్డారు. రైతుకంట కన్నీరు కారుతుంటే పట్టించుకునే నాధుడే లేడని వాపోయారు. రైతు పెట్టుబడులన్నీ వరద నీటిలో కొట్టుకుపోయాయన్న ఉమా.. రాష్ట్రంలో ఇంత పచ్చి మోసం ఎన్నడూ రైతు చూడలేదన్నారు.

రైతు భరోసా కేంద్రాలు ‌వట్టి బోగస్ అని పేర్కొన్నారు. రైతులకు పంట నష్టపరిహారం చెల్లించకపోవడంపై నిలదీశారు. అసెంబ్లీ సాక్షిగా ఇస్తామన్న రూ.1250కోట్లు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. పసుపు చైతన్యం కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా కంచికచర్ల మండలంలోని కునికినపాడు గ్రామంలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, దేశం నాయకులు, రైతులతో కలసి పంట పొలాలను పరిశీలించారు.

ఇదీచదవండి:ఇక్కడ కుక్కలే వైరస్​ను పసిగట్టేస్తాయి!

ABOUT THE AUTHOR

...view details