తాము పండించిన పంటను కొనుగోలు చేయాలని రైతులు రోడ్డెక్కే పరిస్థితి నేడు రాష్ట్రంలో ఉందని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆవేదన వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధర అడిగిన రైతులను లాఠీలతో కొట్టి, అరెస్టు చేస్తున్నారని.. నిబంధనల పేరుతో రైతు కష్టాన్ని దళారులు దోచేస్తున్నారని మండిపడ్డారు. పండించిన పంటలను ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేయడం లేదో ముఖ్యమంత్రి జగన్ రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
'నిబంధనల పేరుతో రైతు కష్టాన్ని దళారులు దోచుకుంటున్నారు' - మాజీ మంత్రి దేవినేని ఉమా
రైతులు.. తమ పంట ఉత్పత్తులను విక్రయించుకునేందుకు రోడ్డెక్కే పరిస్థితి రాష్ట్రంలో ఉందని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు.
'నిబంధనల పేరుతో రైతు కష్టాన్ని దళారులు దోచుకుంటున్నారు'