రాష్ట్రంలో సుబాబుల్, జామాయిల్ రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉందని మాజీమంత్రి దేవినేని ఉమ ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలంలోని బత్తినపాడులో రైతులతో కలిసి సుబాబుల్ చెట్లను పరిశీలించారు. సుబాబుల్ రైతులకు ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలను అమలుపరచకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ఈ పరిస్థితిపై నందిగామ, మైలవరం ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వీటిపై ముఖ్యమంత్రి స్పందించకపోతే తెలుగుదేశం పార్టీ తరఫున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
రైతుల సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు చేస్తాం: దేవినేని ఉమ - devineni uma tour in krishna district
కృష్ణా జిల్లా బత్తినపాడులో సుబాబుల్ చెట్లను మాజీ మంత్రి దేవినేని ఉమ పరిశీలించారు. రాష్ట్రంలో సుబాబుల్, జామాయిల్ రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి దేవినేని ఉమ