తప్పుడు కేసులు, నోటీసులకు భయపడేది లేదని మాజీ మంత్రి దేవినేని ఉమ స్పష్టం చేశారు. తిరుపతిపై సీఎం అభిప్రాయం వివరించాలనే వీడియో ప్రదర్శించినట్లు తెలిపారు. సీఎం స్వయంగా చెప్పిన మాటల వీడియోనే ప్రదర్శించానని దేవినేని ఉమ అన్నారు. కక్షపూరితంగా నోటీసులిచ్చి అత్యుత్సాహం ప్రదర్శించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జలాల తాకట్టు తీరును ఎండగట్టినందుకే కక్షసాధింపని ఆరోపించారు. షెడ్యూల్ 11లో లేని విధంగా రానున్న రోజుల్లో కృష్ణా జలాలపై హక్కులు కోల్పోయేలా వ్యవహరిస్తున్న తీరుపై సీఎం సమాధానం చెప్పి తీరాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు. సీఎం మాటలను చంద్రబాబు వినిపిస్తే రాళ్లు వేయించారని దేవినేని ఉమ అన్నారు. చంద్రబాబు ప్రచారంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారని ఆరోపించారు.
'తప్పుడు కేసులు, నోటీసులకు భయపడేది లేదు' - సీఎం జగన్పై దేవినేని ఉమా వ్యాఖ్యలు
తప్పుడు కేసులు, నోటీసులకు భయపడకుండా ఇంకా గట్టిగా పోరాటం చేస్తానని మాజీ మంత్రి దేవినేని ఉమ స్పష్టంచేశారు. కృష్ణా జలాల తాకట్టు తీరును ఎండగట్టినందుకే నోటీసు ఇచ్చారని ఆరోపించారు.
tdp leader devineni uma comments on cid notices
ఈనెల 7న దేవినేని ఉమా మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో మార్ఫింగ్ చేసిన జగన్ వీడియోలు ప్రదర్శించారని అభియోగం. ఈమేరకు 464, 465, 468, 469, 470, 471, 505, 120(బి) సెక్షన్ల కింద ఉమాపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ప్రెస్‌మీట్‌లో ప్రదర్శించిన వీడియోలు కూడా తీసుకురావాలని నోటీసులో పేర్కొన్నారు.
ఇదీ చదవండి:మాజీ మంత్రి దేవినేని ఉమకు సీఐడీ నోటీసులు