సీఎం జగన్ ప్రజల గుండెలపై తన్నారని దేవినేని విమర్శ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా సరే రాజధాని అమరావతిని కాపాడుకుంటామని మాజీ మంత్రి, తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. రాజధానిపై నివేదిక ఇచ్చిన జీఎన్ఆర్ కమిటీ సభ్యులు రైతుల ఆగ్రహం చూసి దొడ్డిదారిన పారిపోయారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ తన పుట్టినరోజు సందర్భంగా ఐదు కోట్ల ప్రజల గుండెలపై తన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు సీఆర్డీఏపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. చట్టాల గురించి అమాత్యులు తెలుసుకోవాలని సూచించారు. 29 గ్రామాల ప్రజలు రోడ్ల మీద ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వచ్చే వారం నుంచి ఓ వైపు న్యాయ పోరాటం.. మరోవైపు ధర్మపోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: