అధికారుల అలసత్వం, ప్రభుత్వ నిర్లక్ష్యంతో.. సుమారు ఐదు వేల ఎకరాల వరకు పంట నీట మునిగిందని తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలంలో భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను రైతులతో కలిసి పరిశీలించారు. రైతులు తమ సమస్యలను ఆయనకు విన్నవించారు.
సకాలంలో పూడిక తీస్తే పంట పొలాలు మునిగేవి కాదనీ.. వారం రోజులుగా నీటిలో ఉండటం వల్ల వరినాట్లు కుళ్లిపోయాయని దేవినేని ఉమ మండిపడ్డారు. సాక్షాత్తూ జిల్లా మంత్రి పేర్ని నాని , ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఇక్కడకు వచ్చి చూసినా.. పరిస్థితిలో మార్పు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.