తన ఖాతాలోకి తెలియకుండా వచ్చిన డబ్బులపై విచారణ జరిపించాలన్న ఎస్సీ రైతును అక్రమంగా అరెస్టు చేశారని తెదేపా శాసనసభాపక్ష విప్ డోలా బాలవీరాంజనేయస్వామి ఆరోపించారు. ఎస్సీ రైతు జైపాల్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. పెట్టిన కేసును ఉపసంహరించుకునేలా.. సీఎం జగన్ స్పందించాలని డిమాండ్ చేశారు. నిందితులను కాపాడుతూ నిజాయితీపరుడైన రైతును అరెస్టు చేయటమేంటని నిలదీశారు. ఎక్కడాలేని నియంత పాలన ఏపీలో కొనసాగుతోందని స్వామి మండిపడ్డారు. రైతు భరోసా కేంద్రాల్లో అన్నదాతలు చెప్పే మాటలు.. వినే పరిస్థితుల్లో సిబ్బంది లేరని విమర్శించారు.
ఎస్సీ రైతును అక్రమంగా అరెస్టు చేయడం అన్యాయం: బాలవీరాంజనేయస్వామి - tdp leader comments on farmer issue in krishna district updates
ఎస్సీ రైతును అక్రమంగా అరెస్టు చేశారని తెదేపా నేత డోలా బాలవీరాంజనేయస్వామి మండిపడ్డారు. నిందితులను కాపాడుతూ నిజాయితీపరుడైన రైతును అరెస్టు చేయటమేంటని ప్రశ్నించారు.

tdp leader comments
TAGGED:
కృష్ణా జిల్లా తాజా వార్తలు