ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆస్పత్రుల్లో బాధితులకు సౌకర్యాలు అందించాలి: చినరాజప్ప - minister kannababu latest news

మంత్రి కన్నబాబుపై తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వాటిని పట్టించుకోకుండా చంద్రబాబుపై విమర్శలు చేయడానికే మంత్రి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆక్షేపించారు.

tdp leader chinnarajappa fire on minister kannababu
తెదేపా నేత నిమ్మకాయల చినరాజప్ప

By

Published : May 9, 2021, 8:35 PM IST

తూర్పుగోదావరి జిల్లాలో కొవిడ్‌ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. జిల్లా మంత్రి కన్నబాబు వారి కష్టాలను పట్టించుకోవడం లేదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప మండిపడ్డారు. ఆక్సిజన్‌ పడకలు, ఐసీయూలు, వెంటిలేటర్ల కొరతతో కరోనా బాధితులు తీవ్ర అవస్థను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ.. మంత్రి కన్నబాబు ప్రజలకు చికిత్స అందించకుండా చంద్రబాబుపై విమర్శలు చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. ఆస్పత్రుల్లో రోగులకు సౌకర్యాలు కల్పించిన అనంతరం మాట్లాడాలని చినరాజప్ప సవాల్‌ విసిరారు.

ABOUT THE AUTHOR

...view details