ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సుప్రీం తీర్పు ఓ మైలురాయి.. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా మారాలి' - చంద్రబాబునాయుడు

శ్రీ పద్మనాభస్వామి ఆలయ నిర్వహణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు స్వాగతించారు. ఈ తీర్పు ఒక మైలురాయి అన్నారు.

TDP leader chandrababu naidu respond on supreme justice on  thiruvananthapuram temple
సుప్రీంకోర్టు తీర్పు ఒక మైలురాయి

By

Published : Jul 14, 2020, 4:58 PM IST

సుప్రీంకోర్టు తీర్పు ఒక మైలురాయి

తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయ వ్యవహారాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒక మైలురాయి అని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ప్రశంసించారు. ట్రావెన్​కోర్ రాజవంశీయుల హక్కులను సమర్థిస్తూ తీర్పు ఇచ్చిన దేశ అత్యున్నత న్యాయస్థానం.. రాజ కుటుంబాల ముందస్తు ఒప్పందాలు, దీర్ఘకాల సంప్రదాయాల పవిత్రతను రక్షించిందని అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్పును గ్రహించాలన్న చంద్రబాబు... సింహాచలం బోర్డు, మాన్సాస్ ట్రస్టు యాజమాన్యంలో జోక్యం చేసుకోవడం మానుకోవాలని హితవు పలికారు. మాన్సాన్ ట్రస్టు సంరక్షకులుగా గజపతి కుటుంబ హక్కులను పరిరక్షించాలని డిమాండ్‌ చేశారు.

ABOUT THE AUTHOR

...view details