ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రజలకు నాటు వైద్యం..పాలకులకు కార్పొరేట్ వైద్యమా..? : బుద్దా వెంకన్న - తెదేపా నేత బుద్దా వెంకన్న ట్వీట్

ఇతర రాష్ట్రాల్లో అధికార పార్టీ నేతలు తమ ప్రభుత్వంపై నమ్మకంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కరోనా చికిత్స చేయించుకుంటున్నారని తెదేపా నేత బుద్దా వెంకన్న అన్నారు. ఏపీలో మాత్రం అందుకు భిన్నంగా ఉందన్నారు. వైకాపా నేతలు వైద్యం కోసం పక్కరాష్ట్రాలకు పరుగులు తీస్తున్నారని బుద్దా వెంకన్నఎద్దేవా చేశారు.

tdp leader budha
tdp leader budha

By

Published : Jul 25, 2020, 5:09 PM IST

"మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్ కరోనా బారిన పడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నారు. బహుశా ఆయన పాలనపై ఉన్న నమ్మకమై ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పూర్తి భిన్నమైన పరిస్థితి ఉంది. కరోనా టెస్టింగ్​లో నెంబర్ 1, వైద్యం అద్భుతం అంటున్న వైకాపా నాయకులు ఏపీలో చికిత్సకి ఎందుకు జంకుతున్నారు? జగన్ గారి పాలన ఆహా, ఓహో అన్నవిజయసాయిరెడ్డి కరోనా పాజిటివ్ రాగానే.. హైదరాబాద్ ఎందుకు పారిపోయారు? ప్రజలకి నాటు వైద్యం, మీ నాయకులకు కార్పొరేట్ వైద్యమా జగన్ రెడ్డి గారు..?"- తెదేపా నేత బుద్దా వెంకన్న

ప్రజలకు నాటు వైద్యం..పాలకులకు కార్పొరేట్ వైద్యమా..? : బుద్దా వెంకన్న

ఇదీచదవండి:'డాక్టర్ పట్టించుకోవట్లేదు..ఆక్సిజన్ పెట్టట్లేదు..ఊపిరి తీసుకోవటం కష్టంగా ఉంది'

ABOUT THE AUTHOR

...view details