ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

(Budha Venkanna) డీజీపీపై ఇంటెలిజన్స్​ నిఘా నడుస్తోంది: బుద్ధా వెంకన్న - tdp comments on dgp goutham sawang

డీజీపీ గౌతమ్​ సవాంగ్​పై (AP DGP Gautham Sawang).. తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న (Budha Venkanna) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డీజీపీ సీఎం జగన్​కు అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. డీజీపీ గౌతం సవాంగ్ మీదే ఇంటెలిజన్స్ నిఘా నడుస్తోందనే చర్చ పోలీసు వర్గాల్లో జోరుగా సాగుతోందని వ్యాఖ్యానించారు.

tdp leader budha venkanna comments on  goutham swang
tdp leader budha venkanna comments on goutham swang

By

Published : Jul 26, 2021, 1:19 PM IST

రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ మీదే ఇంటెలిజన్స్ నిఘా నడుస్తోందనే చర్చ.. పోలీసు వర్గాల్లో జోరుగా సాగుతోందని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న అన్నారు. గౌతం సవాంగ్​ డీజీపీగా కంటే.. సీఎం జగన్​కు అనుకూలంగానే పని చేశారని ఆరోపించారు.

ఓ సీఐని కూడా బదిలీ చేయలేని స్థితిలో డీజీపీ ఉన్నారని ఎద్దేవా చేశారు. గౌతం సవాంగ్ ఏ పరిస్థితుల్లో ఉన్నా సీఎం జగన్​ మెప్పు కోసం తెదేపా నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం సరికాదని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details