జయప్రకాశ్ నారాయణ్ను ఎమర్జెన్సీ సమయంలో అరెస్టు చేసినప్పుడు... వినాశకాలే విపరీత బుద్ధి అని అన్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ సామెత రాష్ట్ర ప్రభుత్వానికి వర్తిస్తుందేమో అని అన్నారు. తప్పుడు కేసులు పెట్టడం, పోలీసు స్టేషన్ల చుట్టూ తిప్పటం... జైళ్లకు పంపించటం నిత్యకృత్యంగా మారిందన్నారు. ఒక అరాచక ఆటవిక విధానాలకు ఈ ప్రభుత్వం నాంది పలికిందని ధ్వజమెత్తారు. తమ వైఫల్యాను కప్పిపుచ్చేందుకు... ప్రతిపక్షాల నోరు నొక్కేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
అభివృద్ధి శూన్యం... అరాచక విధానాలు ఎక్కడా చూసినా అవినీతి అక్రమాలుకు ఈ ప్రభుత్వం కేంద్ర బిందువుగా మారిందంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ఇసుక, మైనింగ్, లిక్కర్ మాఫియా ఉందని ఆరోపించారు. భవన నిర్మాణ కార్మికులు పనుల్లేక పస్తులుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.