ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Bonda Uma: తెదేపా హయాంలో నిర్మించిన ఇళ్లకు ఓటీఎస్ పేరుతో నోటీసులు ఇవ్వడం దారుణం' - tdp bonda uma news

Bonda Uma press meet: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం హయాంలో నిర్మించిన ఇళ్లకు ఓటీఎస్​ పేరుతో ప్రస్తుతం నోటీసులు ఇవ్వడం పట్ల ఆ పార్టీ నేత బొండా ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు కట్టిన ఇళ్లకు ఇప్పుడు నోటీసులు ఇవ్వడం హేయమైన చర్యగా ఆయన పేర్కొన్నారు.

Bonda Umamaheswararao
బోండా ఉమామహేశ్వరరావు

By

Published : Jan 29, 2022, 4:51 PM IST

Bonda Uma on OTS: కృష్ణా జిల్లా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో తెదేపా హయాంలో నిర్మించిన ఇళ్లకు జీవో 225 రూపంలో ప్రభుత్వం భారీ మొత్తాన్ని వసూలు చేస్తోందని తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఈ మేరకు ప్రభుత్వ.. ఆ గృహ యజమానులకు నోటీలు అందించి వేధింపులకు గురిచేస్తుండటం దారుణమని బొండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలో తెదేపా హయాంలో పేదలకు ఉచితంగా ఇళ్లు కట్టించామని.. వారికి ఇప్పుడూ ఓటీఎస్​ పేరుతో నోటీసులు ఇవ్వడం హేమమైన చర్యగా పేర్కొన్నారు. దీనిపై ప్రజా వ్యతిరేకతను తీవ్ర స్థాయిలో ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వానికి హితవు పలికారు.

ఇలా నోటీసు ఇవ్వడం సరైన విధానం కాదని.. దీనిపై తెదేపా ఆధ్వర్యంలో త్వరలో పోరాటం చేస్తామని ప్రకటించారు. తాము తిరిగి అధికారంలోకి రాగానే జీవో 225, ఓటీఎస్ విధానంపై పునరాలోచన చేస్తామని.. ఎవరికి పైసా ఖర్చు లేకుండా ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేయిస్తామని బొండా ఉమ హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details