ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

water dispute: 'సీఎంలు కూర్చొని మాట్లాడితే జల వివాదం పరిష్కారమవుతుంది' - కృష్ణా జలాలు

కొత్త వివాదం కోసమే ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ తీసుకువచ్చిందని తెదేపా నేత బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఇరు రాష్ట్రాల సీఎంలు కూర్చొని మాట్లాడితే.. జలవివాదం పరిష్కారం అవుతుందని అన్నారు.

bonda umamaheswara rao
తెదేపా నేత బోండా ఉమామహేశ్వరరావు

By

Published : Jul 16, 2021, 12:20 PM IST

Updated : Jul 16, 2021, 12:54 PM IST

ఇరు రాష్ట్రాల సీఎంలు కూర్చొని మాట్లాడితే జల వివాదం పరిష్కారం అవుతుందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు అభిప్రాయపడ్డారు. ఎగువ రాష్ట్రం ఇష్టం వచ్చినట్లు ప్రాజెక్టులు కడితే.... కింద రాష్ట్రానికి నీరు ఎలా వస్తుందని ఆయన ప్రశ్నించారు. కొత్త వివాదం కోసమే ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ తీసుకువచ్చిందని విమర్శించారు.

విజయవాడ నగరపాలక కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో ప్రతిపక్షసభ్యుల గొంతు నొక్కి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. జీవో 198,199 అమలులోకి వస్తే దాని ప్రభావం రాష్ట్ర ప్రజలపై పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇంటి, చెత్త పన్ను కట్టేందుకు సొంతిల్లు అమ్ముకోవాల్సి వస్తుందని ఆక్షేపించారు. వెంటనే జీవో అమలును వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చూడండి.Jindal Steel and Power: జిందాల్‌ స్టీల్‌ ప్లాంట్​కు 860 ఎకరాల భూముల కేటాయింపు

Last Updated : Jul 16, 2021, 12:54 PM IST

ABOUT THE AUTHOR

...view details