గుంటూరు జిల్లా మాచర్లలో తనపై హత్యాయత్నం జరిగిన దృష్ట్యా భద్రత కల్పించాలని తెదేపా మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ విజయవాడ పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావును కోరారు. దాడి వైనాన్ని వివరించిన ఆయన.. తమకు భద్రత పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఇంకా తమకు వైకాపా నేతల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పారు. దాడికి గురైన కారును సైతం సీపీ కార్యాలయానికి తీసుకొచ్చి ప్రదర్శించారు. ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ తనతో పాటు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు భద్రతను తగ్గించిందని అన్నారు. వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముఠాను ఏర్పాటు చేసి తమపై దాడి చేయించారని బొండా ఉమ ఆక్షేపించారు. హత్యాయత్నం డైరెక్షన్ అంతా తాడేపల్లి నుంచే జరిగిందని అన్నారు. తమ నాయకుడు చంద్రబాబు సహా నారా లోకేశ్‌ను తప్పించాలని ప్రభుత్వం చూస్తోందని పేర్కొన్నారు. తెదేపా నేతలందరి ఫోన్లను సర్కారు ట్యాప్ చేస్తోందని ఆరోపించారు.
పక్కా ప్లాన్‌తోనే దాడి చేశారు.. భద్రత కల్పించండి: బొండా ఉమ
వైకాపా నేతలు పక్కా ప్లాన్ ప్రకారమే తమపై దాడి చేయించారని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ ఆరోపించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఓ ముఠాను ఏర్పాటు చేసి దాడికి తెగబడ్డారని మండిపడ్డారు. గుంటూరు జిల్లా మాచర్లలో తమపై దాడి జరిగిన తీరును సీపీ ద్వారకాతిరుమలరావుకు వివరించారు. తమకు భద్రత కల్పించాలని సీపీని కోరారు.
పక్కా ప్లాన్‌తోనే దాడి చేశారు.. భద్రత కల్పించండి: బొండా ఉమ