ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఒక్కరి కోసం తిరుమల నిబంధనలు మార్చాలా?: బొండా ఉమ - సీఎం జగన్​పై బొండా ఉమ విమర్శలు

ముఖ్యమంత్రి జగన్​పై తెదేపా నేత బొండా ఉమ విమర్శలు చేశారు. ఆయన ఒక్కరికోసం తిరుమల నిబంధనలు మార్చాలా అంటూ ప్రశ్నించారు. హిందూ దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్నా ఇప్పటివరకు సీఎం ఎందుకు స్పందించలేదని నిలదీశారు.

bonda uma
బొండా ఉమ, మాజీ ఎమ్మెల్యే

By

Published : Sep 24, 2020, 3:57 PM IST

హిందువులు, స్వామీజీలు, పీఠాధిపతుల కంటతడి రాష్ట్రానికి మంచిది కాదని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. సీఎం జగన్ చర్యతో తిరుమల పవిత్రత మంటగలిసిందని విమర్శించారు. ఇతర మతానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే.. తరతరాల నుంచి ఉన్న ఆచారాలు, నిబంధనలు మార్చాలా? అంటూ బొండా ఉమ మండిపడ్డారు. తన ఇంటిపై శిలువ బొమ్మ వేసుకున్న జగన్, ఇతర మతాలను కూడా అంతే గౌరవించాలి కదా అని అన్నారు.

ముఖ్యమంత్రి జగన్‌తోపాటు ఎంతోమంది అన్యమతస్థులు స్వామివారి ఆలయంలోకి ప్రవేశించారన్నారు. స్థానిక ఎన్నికలు వాయిదా పడితే అరగంటలో స్పందించిన సీఎం హిందూమతంపై జరిగే దాడులను మాత్రం పట్టించుకోవడం లేదని ఆక్షేపించారు. శ్రీకృష్ణదేవరాయల గురించి మిడిమిడిజ్ఞానంతో మాట్లాడిన మంత్రి కొడాలి నానీని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని బొండా డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details