రాజధానిపై ప్రభుత్వ తీసుకుంటున్న నిర్ణయాలను తెదేపా నేత బోండా ఉమా మండిపడ్డారు. ఒక రాజధాని కట్టలేని వారు 3 రాజధానులు ఎలా కడతారని ఆయన ప్రశ్నించారు. రాజధానిపై వైకాపా నేతల తీరు ఒక్కోచోట ఒక్కోలా ఉందని విమర్శించారు. రాజధాని పేరుతో ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు.
ఒక రాజధాని కట్టలేని వారు.. 3 రాజధానులు ఎలా నిర్మిస్తారు? - ఏపీలో రాజధాని వార్తలు
రాష్ట్రంలో ఒక రాజధానిని నిర్మించలేని వారు మూడు రాజధానులు ఎలా కడతారని తెదేాపా నేత బోండా ఉమా మండిపడ్డారు. వైకాపా నేతలు రాజధానిపై ఒక్కోచోట ఒకలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. మూడు రాజధానుల నిర్ణయంపై ధైర్యం ఉంటే ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను కోర్టులో సవాలు చేస్తామన్నారు.

తెదేాపానేత బోండా ఉమా
అమరావతి రాజధాని డిమాండ్ కొన్ని పార్టీల డిమాండ్ కాదని స్పష్టం చేశారు. అమరావతి రాజధానిగా ఉండాలని అన్ని జిల్లాల ప్రజల కోరిక అని తెలియజేశారు. 3 రాజధానుల నిర్ణయంపై ధైర్యం ఉంటే ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను కోర్టులో సవాలు చేస్తామన్నారు.
ఇవీ చదవండి