ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సొంత వారికి పంచభక్ష పరమాన్నం.. వాళ్లకేమో గంజినీళ్లు : బీదా రవి - తెదేపా నేత బీదా రవి వార్తలు

సామాజిక న్యాయం పేరుతో సీఎం జగన్ ...వెనుకబడిన వర్గాలకి అన్యాయం చేస్తున్నారని తెదేపా నేత బీదా రవి ఆరోపించారు. సొంత సామాజికవర్గానికి ప్రతిష్ఠాత్మక కార్పొరేషన్ పదవులు కట్టబెట్టి.. నిధులు, చిరునామాలు లేని పదవులు బలహీన వర్గాలకు ఇచ్చారని మండిపడ్డారు.

tdp leader beeda ravi outraged on cm jagan
తెదేపా నేత బీదా రవి

By

Published : Jul 23, 2021, 3:16 PM IST

సామాజిక న్యాయం పేరుతో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వెనుకబడిన వర్గాలను దగా చేస్తున్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర యాదవ్ ధ్వజమెత్తారు. రెండేళ్లలో బడుగు బలహీన వర్గాల జీవితాలను ఏం మార్చారో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. సొంత సామాజికవర్గానికి ప్రతిష్ఠాత్మక కార్పొరేషన్ పదవులు కట్టబెట్టి.. నిధులు, చిరునామాలు లేని పదవులు బలహీన వర్గాలకు ఇచ్చారని ఆరోపించారు. సంక్షేమం పేరుతో మోసం చేస్తున్న జగన్ రెడ్డి నిజస్వరూపాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు.

తెదేపా ప్రభుత్వ హయాంలో 60శాతం ప్రాధాన్యత కలిగిన పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చామని గుర్తుచేశారు. జగన్ రెడ్డి పదవులిచ్చినట్లు అంకెలగారెడీ చేస్తున్నారు తప్ప నిర్ణయాధికారం ఉన్న పదవులేవీ బీసీలకు ఇవ్వకుండా వారి ఎదుగుదలను అడ్డుకున్నారన్నారని విమర్శించారు. సొంత వారికి పంచభక్ష పరమాన్నం పెడుతూ, వెనుకబడిన వర్గాలకు గంజినీళ్లు పోస్తున్నట్లుగా వైకాపా ప్రభుత్వం తీరుందని మండిపడ్డారు.

ఇదీ చూడండి.rains: ప్రమాదకరంగా పెద్దవాగు..రాకపోకలకు ఇబ్బందులు

ABOUT THE AUTHOR

...view details