కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని మల్లవల్లి, రంగన్నగూడెంలో వరదల కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను తెదేపా గన్నవరం ఇంచార్జ్ బచ్చుల అర్జునుడు పరిశీలించారు. వర్షాలకు పంటలు పూర్తిగా నాశనమయ్యాయని అర్జునుడు అన్నారు. వర్షాలకు వరి, మినుముల పంటలు పూర్తిగా నాశనమయ్యాయని రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వరి పంటకు రూ. 25వేలు, మినుములకు రూ. 30వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని బచ్చుల అర్జునుడు డిమాండ్ చేశారు.
'పరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలి' - కృష్ణా జిల్లాలో రైతులపై వరదల ప్రభావం
వరదల కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించి ప్రభుత్వం ఆదుకోవాలని తెదేపా నేత బచ్చుల అర్జునుడు కోరారు.కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని మల్లవల్లి, రంగన్నగూడెంలో వరదలతో నష్టపోయిన పంటను అర్జునుడు పరిశీలించారు.
!['పరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలి' tdp leader bacula on floods in andhra pradesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9273931-951-9273931-1603370807490.jpg)
పంటను పరిశీలిస్తున్న బచ్చుల అర్జునుడు