తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు విజయవాడలో జరిగిన కృష్ణా జిల్లా పార్టీ సమీక్షా సమావేశాలు విజయవంతంగా జరిగాయని.. తెదేపా కృష్ణా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు తెలిపారు. విజయవాడలో మాట్లాడిన ఆయన... క్షేత్రస్థాయిలో పార్టీ స్థితిగతులను తెలుసుకుని చంద్రబాబు దిశానిర్దేశం చేశారన్నారు. జిల్లాలో నాలుగైదు నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలపై ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. సమీక్షలకు ఆశించిన దానికంటే ఎక్కువ మంది కార్యకర్తలు వచ్చారని అర్జునుడు హర్షం వ్యక్తం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలంటే గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయిలో కమిటీల అవసరం ఉందనీ.. త్వరలోనే కమిటీల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు.
సీఎం జగన్ గురించి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తుల్లో జగన్పై మాత్రమే ఇన్ని కేసులున్నాయని ఎద్దేవా చేశారు. సీఎం హోదాలో కోర్టుకు వెళ్లడం సిగ్గుపడాల్సిన విషయమన్నారు. ఇసుక విషయంలో కుంటి సాకులు చెబుతున్నారని మండిపడ్డారు. అమరావతి విషయంలో జగన్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
'సమీక్షలు విజయవంతం.. స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యం' - తెదేపా నేత బచ్చుల అర్జునుడు తాజా మీడియా సమావేశం
కృష్ణా జిల్లా నేతలకు తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు దిశానిర్దేశం చేశారని.. ఇక స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యమని తెదేపా నేత బచ్చుల అర్జునుడు తెలిపారు. ఈనెల 15 నుంచి గ్రామస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
బచ్చుల అర్జునుడు మీడియా సమావేశం