ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తితిదేపై ఏం చెప్పారు..!ఇప్పుడేం చేస్తున్నారు..!'

తితిదేలో వైకాపా ప్రభుత్వం నియమించిన 29 మంది సభ్యుల పాలకమండలిపై ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మండిపడ్డారు. సామాజిక న్యాయం ప్రకారం బోర్డు సభ్యులను నియమిస్తామన్న నేతలు, ఇప్పుడు చేసింది ఏంటని ప్రశ్నించారు.

తితిదే బోర్డు సభ్యులు

By

Published : Sep 20, 2019, 4:03 PM IST

'తితిదే బోర్డు సభ్యుల నియామకాల్లో వైకాపా మాట మార్చింది'

తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు సభ్యులుగా75శాతం స్థానికులకు అవకాశం ఇస్తామని చెప్పిన వైకాపా ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చిందని తెదేపా ఎమ్మెల్సీ,కృష్ణాజిల్లా తెదేపా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు ఆరోపించారు.తెదేపా హయాంలో బోర్డు సభ్యునిగా శేఖర్ రెడ్డిని నియమిస్తే తప్పుబట్టిన వైకాపా,ఇప్పుడు అదే శేఖర్ రెడ్డిని ఎక్స్ అఫీషియోగా నియమించడాన్ని..ఎలా అర్దం చేసుకోవాలని ప్రశ్నించారు.సామాజిక న్యాయం ప్రకారం నియామకాలు జరుపుతామని శాసనసభ,శాసనమండలిలో చెప్పిన మాటలు ఏమైయ్యాయని ఆయన మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details