తెదేపా నేత అయ్యన్నపాత్రుడు ప్రభుత్వంపై విమర్శలు అనంతపురం ఘటనపై తెదేపా నేత అయ్యన్నపాత్రుడు ట్విట్టర్ ద్వారా విమర్శలు గుప్పించారు. ప్రజలకు చెట్టు కింద వైద్యం అందిస్తున్న వైకాపా ప్రభుత్వం.., ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీ విజయసాయి రెడ్డి వాళ్లు మాత్రం హైదరాబాద్లో కార్పొరేట్ వైద్యం కోసం వెళ్తున్నారని మండిపడ్డారు. వైకాపా నాయకులు ఆంధ్రప్రదేశ్లో వైద్యం ఎందుకు చేయించుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు.
తెదేపా నేత అయ్యన్నపాత్రుడు ప్రభుత్వంపై విమర్శలు టెస్టుల్లో టాప్, వైద్యంలో నెంబర్ 1 అంటూ డప్పుకొట్టుకుంటున్న వారు... కరోనా పాజిటివ్ రాగానే ఇతర రాష్ట్రాల్లో వైద్యం చేయించుకోవడానికి ఎందుకు పారిపోతున్నారని నిలదీశారు. ఈ వివక్ష ఎందుకని సీఎం జగన్ను ప్రశ్నించారు.
తెదేపా నేత అయ్యన్నపాత్రుడు ప్రభుత్వంపై విమర్శలు ఆంబులెన్స్ రాక ...రోగులను ఆటోల్లో తీసుకువెళ్లాల్సిన పరిస్థితి ఉందని ధ్వజమెత్తారు. సరైన వైద్యం అందక ప్రజలు రోడ్ల మీదే ప్రాణాలు వదులుతున్న దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస గౌరవం లేకుండా మృతదేహాలను జెసీబీలతో విసిరేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజారోగ్యం పట్ల నిర్లక్ష్య ధోరణి మంచిది కాదని హితవు పలికారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అయ్యన్న ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
ఇదీ చూడండి.లక్ష విలువైన 'నాడు - నేడు' పనులకు లక్షా 70 వేలు వసూలు...