ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మూడు రాజధానులు కావాలని ఎవరడిగారు?: అచ్చెన్నాయుడు

రాజధాని విషయంలో వైకాపా సర్కార్ తీరుపై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ ప్రతిపక్ష నేతగా అమరావతికి మద్దతు తెలిపి... ఇప్పుడు మాట తప్పారని మండిపడ్డారు. అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

tdp leader atchannaidu
tdp leader atchannaidu

By

Published : Dec 14, 2020, 6:55 PM IST

మీడియాతో అచ్చెన్నాయుడు

ఒక వ్యక్తి మీద కోపంతో రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్ నాశనం చేశారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఇలాంటి సీఎం ప్రపంచంలో మరెక్కడా ఉండరని వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం తెదేపా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన... వైకాపా సర్కార్​పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా శాసనసభలో అమరావతికి మద్దతు ఇచ్చి... ఇప్పుడు మాట తప్పారని అచ్చెన్న దుయ్యబట్టారు. మూడు రాజధానులు కావాలని ఎవరు అడిగారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అమరావతి రైతుల ఉద్యమానికి ఏడాది పూర్తయిన రోజున.. ఒకటే రాజధాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. మరోవైపు వ్యవసాయ మోటార్లకు విద్యుత్తు మీటర్లు అమర్చితే శ్రీకాకుళం నుంచే ఉద్యమిస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details