ఇళ్ల పట్టాల ముసుగులో వైకాపా నేతలు చేసిన అవినీతిని సాక్ష్యాలతో సహా నిరూపించేందుకు తాము సిద్ధమని తెదేపా సీనియర్ నేత జీవీ ఆంజనేయులు స్పష్టం చేశారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేందుకు వైకాపా సిద్ధమా? అని సవాల్ విసిరారు. ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా నేతలు వేల కోట్లు దోచుకుంటూ.. లాభపడ్డారని చెప్పారు. తక్కువ రేటుకు భూమిని కొనుగోలు చేసిన వైకాపా నేతలు అందుకు మూడు రెట్లు ఎక్కువ ధరకు ఆ భూమిని ప్రభుత్వానికి అమ్మి సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు.
'వైకాపా నేతలు చేసిన అవినీతిని సాక్ష్యాలతో నిరూపించేందుకు సిద్దం' - gv anjanjaneyulu latest updates
వైకాపా నేతలు చేసిన అవినీతిని సాక్ష్యాలతో సహా నిరూపించేందుకు తాము సిద్ధమని తెదేపా సీనియర్ నేత జీవీ ఆంజనేయులు స్పష్టం చేశారు. తక్కువ రేటుకు భూమిని కొనుగోలు చేసిన వైకాపా నేతలు అందుకు మూడు రెట్లు ఎక్కువ ధరకు ఆ భూమిని ప్రభుత్వానికి అమ్మి సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు.
వినుకొండ నియోజకవర్గంలోనే ఎకరా రూ.4లక్షలకు కొనుగోలు చేసిన ఎమ్మెల్యే ప్రభుత్వానికి ఆ భూమిని రూ.18లక్షలు చొప్పున అమ్మారని తెలిపారు. అవినీతికి లైసెన్స్ ఇచ్చామనట్లుగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో ఇదే తరహా విధానాన్ని అధికారపార్టీ కొనసాగించిందని దుయ్యబట్టారు. ఏటా 5లక్షల ఇళ్లు నిర్మిస్తామని ఇచ్చిన హామీ మేరకు గత రెండేళ్లలో 10లక్షల ఇళ్లు నిర్మించాల్సి ఉండగా ఒక్క ఇల్లు కట్టకుండా చేసిన శంకుస్థాపనలే మళ్లీ మళ్లీ చేస్తున్నారని ఆంజనేయులు విమర్శించారు.
ఇదీ చదవండి:Jagan delhi tour: ముఖ్యమంత్రి జగన్ రేపు దిల్లీ వెళ్లే అవకాశం