మాన్సాస్ ట్రస్ట్ ఛైర్ పర్సన్‌గా నియమితులైన సంచయిత గజపతిరాజు... చంద్రబాబు, లోకేశ్‌పై ఆరోపణలు చేయడం సిగ్గుచేటని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. ట్రస్ట్ బైలాస్ ప్రకారం మగవాళ్లే.. వారసుడే ఛైర్మన్ గా ఉండాలనే నిబంధన ఉన్నా.. సింహాచలం దేవస్థాన భూములపై కన్నేసిన ప్రభుత్వం సంచయితను ట్రస్ట్ చైర్మన్ గా నియమించిందన్నారు.
సంచయితను సక్రమంగా నియమించి ఉంటే జీవోను ఎందుకు వెబ్ సైట్లో పెట్టలేదని ప్రశ్నించారు. పాస్ పోర్ట్, ఆధార్ కార్డు చూపించే ధైర్యం సంచయితకు ఉందా అని నిలదీశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు రోడ్డున పడటానికి సంచయితనే కారణమని ధ్వజమెత్తారు.