ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంత్రి ఒక దళితుడై ఉండి...ఇలా మాట్లాడటం ఎంతవరకు సమంజసం!

నక్సలైట్లలో ఎవరైనా చేరవచ్చని మంత్రి పినిపే విశ్వరూప్ మాట్లాడటం బాధ్యతారాహిత్యమని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

tdp leader anitha comments on minister pinepi viswaroop
తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత

By

Published : Aug 14, 2020, 8:23 AM IST


నక్సలైట్లలో ఎవరైనా చేరవచ్చని మంత్రి పినిపే విశ్వరూప్ మాట్లాడటం బాధ్యతారాహిత్యమని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడి దళిత సమాజానికి ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారని ఆమె ప్రశ్నించారు. సార్వభౌమతాన్ని, సమగ్రతను కాపాడతానని ప్రమాణ స్వీకారం చేసి... పౌరుల్ని నక్సల్ లో చేరమని చెబుతారా? అని నిలదీశారు. సమాజానికి ఏం సందేశమివ్వాలనుకుంటున్నారని ధ్వజమెత్తారు. మంత్రి స్థాయిలో ఉండి ఈ విధంగా మాట్లాడటం సరికాదన్నారు. శిరోముండనం బాధితుడు వరప్రసాద్ తనకు జరిగిన అన్యాయాన్నీ భరించలేక.. నక్సల్స్ లో చేరతానని రాష్ట్రపతికి లేఖ రాస్తే అతన్ని హేళన చేసేలా మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. మంత్రి ఒక దళితుడై ఉండి... సాటి దళితులనికి అవమానం, అన్యాయం జరిగితే న్యాయం చేయకపోగా ఇలా మాట్లాడటం ఎంతవరకు సమంజసంమని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details