ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'జిల్లాలో పరిస్థితి చేయి దాటిపోకుండా చర్యలు చేపట్టాలి' - ఈరోజు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తాజా వ్యాఖ్యలు

జిల్లాలో పరిస్థితి చేయి దాటిపోకుండా కరోనా నివారణ చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కోరారు. నెల్లూరులోని కరోనా విజృంభణపై సీఎంకు లేఖ రాసిన ఆయన.. పరిస్థితిని చక్కదిద్దాలని డిమాండ్ చేశారు.

tdp leader and ex minister somireddy
మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

By

Published : Apr 21, 2021, 1:49 PM IST

మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రంలోనే నమోదయ్యే కేసుల్లో ఎక్కువ నెల్లూరులోనే ఉంటున్నాయని ఆయన వెల్లడించారు. జీజీహెచ్​లో ఉన్న అన్ని బెడ్లపై వైద్యసేవలు అందించటంతో పాటు.. ప్రభుత్వాసుపత్రిలో ఖాళీగా ఉన్న వెంటిలేటర్లను తాత్కాలికంగా ప్రైవేటు ఆస్పత్రులకు పంపి ఉచిత వైద్య సేవలందించాలని సూచించారు. అవసరమైన సిబ్బందిని నియమించి గత పొరపాట్లు పునరావృతం కాకుండా చూడాలన్నారు. జిల్లాలో మెరుగైన వైద్యం అందక.. చెన్నైకి వెళ్లి ప్రజలు లక్షలు ఖర్చు పెడుతున్నారన్నారు. వైద్య శాఖ మంత్రి నేతృత్వంలో కమిటీని జిల్లాకు పంపి వెంటనే పరిస్థితులు చక్కదిద్దాలని లేఖలో డిమాండ్ చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details