అమరావతి రెఫరెండంపై ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడటం లేదని తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ప్రశ్నించారు. రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్దామంటే వైకాపా ఎమ్మెల్యేలు ఎందుకు సవాల్ స్వీకరించలేదని నిలదీశారు. విద్వేషం, విధ్వంసం లేకుండా వైకాపాకి ఉనికి లేదని విమర్శించారు. పగ, ప్రతీకారం, కూల్చివేతలు, అణచివేతలు తప్ప 18 నెలలుగా చేసింది శూన్యమని దుయ్యబట్టారు. మహిళలపై రాళ్ల దాడి చేసిన వారిని ఎందుకు అరెస్టు చేయలేదని అనగాని సత్యప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
'అమరావతి రెఫరెండంపై సీఎం ఎందుకు నోరువిప్పరు?' - అమరావతి వివాదంపై అనగాని వ్యాఖ్యలు
అమరావతి రెఫరెండంపై సీఎం జగన్ ఎందుకు నోరువిప్పరని తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నిలదీశారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత చేసింది శూన్యమని ఆరోపించారు.
tdp leader anagani fires on cm jagan on amaravathi issue