వైకాపా అవినీతి పాలనకు ప్రజలు త్వరలోనే ఉందని బుద్ధి చెప్తారని తెదేపా నేత అమర్నాథ్ రెడ్డి అన్నారు. బెంజికారు కుంభకోణంపై సరైన సమాధానం చెప్పుకునేలోపే మంత్రి జయరాం చేసిన 400 ఎకరాల భూదోపిడీని ఆధారాలతో సహా బయటపెట్టామని వెల్లడించారు. అవినీతిని ప్రశ్నిస్తే బూతులు తిట్టి, దాడులు చేస్తూ అక్రమ కేసులు బనాయించటంతో పాటు...ఆస్తుల ధ్వంసానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. అన్ని నియోజకవర్గాల్లో ప్రజల సొమ్మును వైకాపా నేతలు దోచుకుంటున్నారని అమర్నాథ్ రెడ్డి ఆరోపించారు. వైకాపా నేతలు జైలుకెళ్లినందుకు అందరినీ పంపాలని చూస్తున్నారని ఆక్షేపించారు. వర్షాలు పడుతున్నా రైతులకు ప్రభుత్వం నీరందించలేకపోతోందని విమర్శించారు.
'అవినీతిని ప్రశ్నిస్తే కేసులు పెడతారా?'
ప్రభుత్వ తీరుపై మాజీమంత్రి అమర్నాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతిని ప్రశ్నిస్తే దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు. మంత్రులు ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని ఆరోపించారు.
మాజీమంత్రి అమర్నాథ్ రెడ్డి