తెదేపా పోరాటంతోనే పదోతరగతి పరీక్షలు వాయిదా పడ్డాయని ఆ పార్టీ నేత, మాజీమంత్రి ఆలపాటి రాజా వ్యాఖ్యానించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కరోనాకు బలికాకుండా ఉండేందుకు.. నారా లోకేశ్ చేపట్టిన పోరాటానికి ప్రభుత్వం దిగొచ్చిందన్నారు. పరీక్షలను పూర్తిగా రద్దు చేసి అంతర్గత పరీక్షల మార్కులు ఆధారంగా విద్యార్థులను ప్రమోట్ చేయాలని డిమాండ్ చేశారు.
తెదేపా పోరాటంతోనే పది పరీక్షలు వాయిదా: ఆలపాటి రాజా - tdp news
తెదేపా పోరాటంతోనే రాష్ట్రంలో పదోతరగతి పరీక్షలు వాయిదా పడ్డాయని ఆ పార్టీ నేత ఆలపాటి రాజా వ్యాఖ్యానించారు. నారా లోకేశ్ చేపట్టిన పోరాటానికి ప్రభుత్వం దిగొచ్చిందన్నారు.
ఆలపాటి రాజా