పెట్రోల్ ధరల పెరుగుదలలో దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రికార్డులు సృష్టిస్తోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. వ్యాట్ రద్దు చేసి ప్రజల్ని ఆదుకోవాల్సిన బాధ్యత సీఎం జగన్‌కు లేదా అని నిలదీశారు.
కేరళ ప్రభుత్వం లీటర్ పెట్రోల్‌పై ఏకంగా రూ.6 తగ్గించిందని పేర్కొన్నారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక రెండుసార్లు ధరలు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదనపు సెస్సు రూ.4, రోడ్డు సెస్సు రూపాయి వేసి సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారన్నారు.