మూడు రాజధానులు, ఇన్ సైడర్ ట్రేడింగ్ అనే పదాలు రాజారెడ్డి రాజ్యాంగంలో మాత్రమే ఉంటాయని తెదేపా నేత కూన రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని ప్రకటన చేశాక.. 127ఎకరాలకు సంబంధించి మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగాయన్నారు. సీఎం జగన్ కు, ఆయన ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధిఉన్నా.. రాజధాని భూములతో పాటు, ఇళ్లపట్టాలకోసం కొనుగోలు చేసిన భూములు, విశాఖలో వైకాపా ప్రభుత్వం సాగించిన భూదందాపైనా సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
విశాఖలో వైకాపా భూదందాపైనా సీబీఐ విచారణ జరగాలి: కూనరవి కుమార్ - tdp koona ravi kumar comments news updates
రాజధాని ప్రకటన చేశాక.. 127ఎకరాలకు సంబంధించి మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగాయని తెదేపా నేత కూన రవికుమార్ అన్నారు. రాజధాని భూములపై సీబీఐ విచారణ జరిపిస్తామన్న వైకాపా ప్రభుత్వం.. విశాఖలో ప్రభుత్వం సాగించిన భూదందాపైనా సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
tdp koona ravi kumar