TDP Kollu Ravindra Fires on Perni Nani: గత 4నాలుగు సంవత్సరాలుగా పేర్ని నాని చేస్తున్న అరాచకాలు, కుట్రలు, కుతంత్రాలు వారి మాజీ అనుచరుల నోటిద్వారా బయటపడుతున్నాయని టీడీపీ మాజీమంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. పవన్ కల్యాణ్‌ను తిట్టడం జగన్ కాళ్లు పట్టుకొని ఏదో ఒక ఫైల్ పని చేయించుకోవడము, అక్రమ సంపాదన కోసం అవినీతి అరాచకమైన పనుల కోసం పవన్ కల్యాణ్, చంద్రబాబులను విమర్శించి పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. మోకా భాస్కర్ రావు హత్య కేసులో అక్రమంగా అన్యాయంగా ఇరికించారనన్న ఆయన.. ఇది పేర్ని నాని కుట్ర అని, ఇప్పుడు ఇదే విషయం తేట తెల్లం అయ్యిందన్నారు. అక్రమాలు అరాచకాలు ఒక్కొక్కటిగా వీరి నోటి ద్వారానే బయటపడుతున్నాయని, ఇవే కాదు ఇంకా అనేక అరాచకాలు త్వరలోనే బయటకు వస్తాయని విమర్శించారు. పేర్నినాని రాజకీయ భవిష్యత్తు కోసం బందరు అభివృద్ధిని నాశనం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాలల ఆత్మీయ సమావేశం: ఈ నెల 27న పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో మాలల ఆత్మీయ సమావేశం నిర్వహించాలని తెలుగుదేశం నిర్ణయించింది. దీనికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈ మేరకు ఎన్టీఆర్ భవన్ లో మాజీమంత్రి నక్కా ఆనంద్‌బాబు నేతృత్వంలో తెదేపాలోని మాల సామాజికవర్గానికి చెందిన నేతలు సమావేశమయ్యారు. మాల, మాదిగల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ తొలుత మోసం చేసింది వారినేనని నేతలు మండిపడ్డారు. మాలల సాధికారత దిశగా ఐక్యంగా పనిచేయాలని నిర్ణయించారు. నమ్మిన మాలల్ని జగన్మోహన్ రెడ్డి అని విధాలా మోసగించారని నేతలు విమర్శించారు. సమావేశంలోఎమ్మెల్యే డోల బాలవీరాంజనేయస్వామి, మాజీ స్పీకర్ ప్రతిభాభారతి, మాజీ మంత్రులు పీతల సుజాత, కొండ్రు మురళీ, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇళ్ల నిర్మాణాలకు ఎంత ఖర్చు పెట్టారో బయట పెట్టాలి: ఇళ్లు చంద్రబాబు కడితే వాటికి రంగులేసుకుని తాము కట్టామని మాట్లాడుతున్నారని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ధ్వజమెత్తారు. సీఎఫ్ఎంఎస్ లో ఎప్పుడెప్పుడు ఈ నిర్మాణాలకు ఎంత ఖర్చు పెట్టారో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు అన్ని ఫ్రీ అని నేడు 300 స్క్వేర్ యాడ్స్ అంటున్నారని మండిపడ్డారు. మొన్న పార్లమెంట్లో ఐదు ఇల్లు మాత్రమే కట్టారని చెప్పారు ఐదు లక్షల ఇళ్లు ఎక్కడ ఐదెక్కడ అని ఆక్షేపించారు. అధికారులు పోస్టింగులకు కక్కుర్తి పడి టిడ్కో ఇళ్లపై తప్పుడు మాటలు మాట్లాడారని ఉమా ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎమ్మెల్యే మంత్రుల మెప్పు కోసం పడే అధికారులను ఎవరూ క్షమించలేరు రేపు మీ దారులన్నీ మూసుకుపోతాయని హెచ్చరించారు.
జగన్ రెడ్డి పేదలను మోసం చేస్తున్నాడు:టిడ్కో గృహాలు కేటాయింపులో జగన్ రెడ్డి పేదలను మోసం చేస్తున్నాడని తెలుగుదేశం నేతలు ధ్వజమెత్తారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ పార్టీ కేంద్రకార్యలయం ఎన్టీఆర్ భవన్ వద్ద నేతలు ఈమేర నిరసన చేపట్టారు. జగన్ అధికారంలోకి వస్తే ఉచితంగా పంపిణీ చేస్తానని మోసపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత పాడుపెట్టారని తెదేపా నేతలు దుయ్యబట్టారు. జగన్ రెడ్డి జగనన్న కాలనీలు ఏర్పాటుచేసిందే సంపాదించుకొవడానికే తప్ప ప్రజలకు మేలు చేయడానికి కాదని ఆక్షేపించారు. దళిత మోసం చేసిన దళిత ద్రోహి జగన్ రెడ్డి అని, అగిపోయిన టిడ్కో గృహాలకు వెంటనే లబ్దిదారులకు అందిచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. టిడ్కో గృహాల విషయంలో జగన్ రెడ్డి వైఖరి చూస్తే సొమ్ము ఒకరిది సొకు ఒకరిది అన్నట్లుందని,కేవలం రంగులు వేసుకొని నాటకానికి తేరలేపారని ఆగ్రహం వ్యక్తంచేశారు. టిడ్కో గృహాలు ఓపెనింగ్ చేయడమే నాలుగేళ్లు పట్టిదంటే నిజంగా పేద వాళ్ల మీద ప్రేమఉందా జగన్ రెడ్డి అని నేతలు ప్రశ్నించారు.
వైసీపీ పేర్నినానిపై టీడీపీ కొల్లు రవీంద్ర ఫైర్