రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన చేస్తోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావ్ మండిపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న అరాచక కార్యక్రమాలతో ప్రజలు దిక్కుతోచలేని స్థితిలో ఉన్నారన్నారు. జగన్ పోలీసులను పక్కన పెట్టుకుని పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేయిస్తున్నారని దుయ్యబట్టారు. జగన్ మూడు రాజధానుల నిర్ణయం తుగ్లక్ చర్య అని విమర్శించారు. చట్టాలను, వ్యవస్థలను జగన్ తన చేతిలోకి తీసుకుంటున్నారని మండిపడ్డారు.
'రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన చేస్తోంది' - ఏపీ అమరావతి వార్తలు
ప్రభుత్వం చేస్తున్న అరాచక కార్యక్రమాలతో ప్రజలు దిక్కుతోచలేని పరిస్థితిలో ఉన్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకట్రావ్ మండిపడ్డారు.
తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకట్రావ్